సైదాపూర్ నవంబర్ 21
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
హుస్నాబాద్ నియోజకవర్గం లోని సైదాపూర్ మండలంలోని ఎల్లబోతారం గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రచారం నిర్వహించిన వారిలో మాజీ సర్పంచ్ మారబోయిన శ్రీనివాస్ గ్రామ మహిళా అధ్యక్షురాలు రావుల కవిత టిఆర్ఎస్ నాయకులు నమిండ్ల రాజు నమిండ్ల సంపత్, మిడిదొడి సుధాకర్,నూనె సంతోష్, మాట్లాడుతు బీమా ప్రతి ఇంటికి ధీమా ఐదు లక్షల బీమా రాష్ట్రంలో తెల్ల కార్డు ఉన్న అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని వృద్ధులకు ఆసరా పెన్షన్ 5016, దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ పెంపు రైతులకు రైతుబంధు 16 వేల రూపాయల పెంపు అగ్రవర్ణాల కులాలకు గురుకుల పాఠశాల ఏర్పాటు కేసిఆర్ ఆరోగ్య రక్ష కింద 15 లక్షల ఆరోగ్య భీమా వర్తింపు మహిళలకు సౌభాగ్య లక్ష్మి కింద గౌరవ వేతనం 3000 రూపాయలు పేద కుటుంబానికి గ్యాస్ సిలిండర్ 400కే సరఫరా మహిళా సమైక్యలకు సొంత భవనాల నిర్మాణానికి తోడ్పాటు ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు గృహలక్ష్మి పథకం వర్తింపు చేస్తామని గ్రామంలో ఇంటింటికి తిరిగి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు . వేసి ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ ను కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటు వేస్తామని నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు.