Home తాజా వార్తలు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

by Telangana Express
  • లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ బండెల రాంచంద్ర రెడ్డి

కల్వకుర్తి, జనవరి 20
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

కల్వకుర్తి మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో అయోధ్యలోని బాల రామునీ ప్రాణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా వెంకటాపూర్ వీర హనుమాన్ యువజన సంఘం, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా చైర్మన్ బండెల రాం చంద్ర రెడ్డి ప్రారంభించారు. రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాల్ని కాపాడవచ్చునని అన్నారు. స్వచ్ఛందంగా యువతీ యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్న వారిని ఆయన అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 25 మంది రక్తదానం చేసినట్లు పిఆర్ఓ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ కిషోర్ రెడ్డి, లయ న్స్ క్లబ్ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, లయన్ సభ్యులు సుధీర్ రెడ్డి, ఎలక్ట్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, జిల్లా చైర్మన్ జూలూరి రమేష్, వివేకానంద యువజన సంఘం సభ్యులు కే. శ్రీనివాస్ రెడ్డి, బి . ప్రవీణ్ రెడ్డి, ఎస్ మల్లేష్, పిఆర్ఓ పాషా తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment