Home తాజా వార్తలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులకు డాక్టరేట్….- ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులకు డాక్టరేట్….- ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 12,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్రం, గణిత శాస్త్రం విభాగాలలో కాంట్రాక్ట్ అద్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న బి.గంగారెడ్డి, జి.సిద్దు రాజ్ లు డాక్టరేట్ అవార్డు అందుకున్నట్లు, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.లక్ష్మినారాయణ గురువారం తెలిపారు. గంగారెడ్డి “తెలంగాణలో హైద్రాబాద్ ప్రాంతంపై నాలుగు చక్రాల వాహనాల కొనుగోలు , వినియోగదారుని ప్రవర్తన మరియు సామర్థ్యం ” పై, సిద్దు రాజు ” క్లౌడ్ కంప్యూటింగ్ వనరులు మరియు డేటా బేస్ ల, గణిత నమూనాలపై అధ్యయనం” అనే అంశాలపై పరిశోధనలు చేసి థీసిస్ సమర్పించినందుకు గాను
జె. జె. టి.యు (శ్రీ జగదీష్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవల్) రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ డాక్టరేట్ అవార్డు పొందడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, కళాశాల ఫ్యాకల్టీ ఫోరం సెక్రటరీ అమరేశం, ప్రభాకర్ రావు లు కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి కళాశాల తరపున ఇద్దరు కాంట్రాక్ట్ అద్యాపకులు గంగారెడ్డి, సిద్దు రాజ్ లను శాలువా కప్పి సత్కరించి అభినందించారు. అలాగే కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment