లోకేశ్వరం డిసెంబర్12
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండల కేంద్రంలోని
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మధ్యాహ్నం జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ పరశురాం నాయక్, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా లైబ్రరీ తరగతి గదులను పరిశీలించారు అలానే కళాశాల సిబ్బంది పనితీరుపై సమీక్షించారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ కె గౌతమ్, మరియు అధ్యాపకులతో సమావేశం ఏర్పాటుచేసి పలు సూచనలు చేశారు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులకు పరీక్షలకు పన్నద్దం చేయాలని, నిత్యం విద్యార్థుల హాజరును నమోదు చేయాలన్నారు . వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు విద్యార్థుల హాజరు శాతం పెంచాలని కళాశాలకు హజరుకాని విద్యార్తులకు సమాచారం అందించి, రప్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఇటీవలే మన ఇంటర్ బోర్డుకు కొత్తగా కార్యదర్శి నియమితులయ్యారని, వారి ఆదేశాల మేరకు ప్రతీ కళాశాలలో తల్లిదండ్రుల పోషకుల సమావేశం నిర్వహించి, విద్యార్థుల భవిష్యత్తుల మార్గ నిర్దేశకాలను తల్లితండులకు తెలియజేయాలన్నారు అనంతరం ప్రతి విద్యార్థి పై 90 రోజుల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కే. గౌతమ్,బి. విఠల్, ఎం ప్రమీల రాణి,జి.శ్రీనివాస్, కే. నవీన్, ఎం.చిన్నయ్య, డి.మహిందర్, ఎ హరీష్ బోధన సిబ్బంది తదితరులు ఉన్నారు