బిచ్కుంద డిసెంబర్ 11 :(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోప్రభుత్వ జూనియర్ కళాశాల బిచ్కుందాలో బుధవారం నాడు కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అధ్యాపకులతో సమావేశం నిర్వహించి కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచడంతోపాటు, మానసిక ఒత్తిడిని పిల్లలు తట్టుకొని సామర్ధ్యవంతంగా విద్యార్థులు ఎదగాలని సూచించారు. ఈ సమావేశంలో అధ్యాపకుల అటెండెన్స్, టీచింగ్ డైరీస్ మరియు ఇయర్ ప్లాన్ పరిశీలించారు . ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు సమన్వయంతో పనిచేసి కళాశాలకు మంచి ఉత్తరతను తీసుకురావాలని సూచించారు. 90 రోజుల యాక్షన్ ప్లాన్ విజయవంతంగా పూర్తి చేయాలని అధ్యాపకులకు సూచించారు అంతేకాకుండా తూచా తప్పకుండా ఈ ఆక్షన్ ప్లాన్ పాటిస్తే విద్యార్థులు విజయవంతంగా ఉత్తీర్ణత శాతం పెంచవచ్చని తెలియజేశారు. అదేవిధంగా కేజీబీవీ బిచ్కుంద, మైనార్టీ కాలేజ్ బిచ్కుంద మరియు రెసిడెన్షియల్ కాలేజ్ పెద్ద ఎక్లార సందర్శించి అడ్మిషన్ రిజిస్టర్ లను పరిశీలించారు.