మంచిర్యాల, నవంబర్ 16, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ మోతీలాల్ ప్రారంభించారు. బుధవారం జన్నారం మండలం
డిఅర్ డిఎ, ఐకెపి ఆధ్వర్యంలో మండలంలోని దేవుని గూడా, కిష్టాపూర్ గ్రామాలలో రైతులు పండించిన వారిని తూకం వేయడానికి ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ డిఆర్డిఓ శేషాద్రి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని ప్రారంభమైన వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు రైతులు పండించిన వరి ధాన్యాన్ని తూకం వేయడంలో దళారులను చూసి మోసపోవద్దని జిల్లా అదనపు కలెక్టర్, డి ఆర్ డి ఓ అన్నారు. జన్నారం మండలంలోని ప్రతి గ్రామంలో డి ఆర్ డి ఏ, ఐకెపి ఆధ్వర్యంలో వరి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, జన్నారం మండల ఏపీవో సిహెచ్ బుచ్చన్న కు జిల్లా దిన కలెక్టర్ డి ఆర్ డి ఓ అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం డిఎం సివిల్ సప్లై గోపాల్, మార్కెటింగ డిపిఎం వేణు గోపాల్, సిసి లు, ఐ సదా చారి, కె సరోజ, కొనుగోలు కమిటీ సభ్యులు, బుక్ కీపర్లు, ఎం శ్రీనివాస్, బి. సత్యం, రైతులు, పాల్గొన్నారు.
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జిల్లా అదుపు కలెక్టర్ మోతీలాల్
25
previous post