Home తాజా వార్తలు డ్రైవింగ్ శిక్షణ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

డ్రైవింగ్ శిక్షణ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

by Telangana Express

. జోగిపేట డిసెంబర్ 17:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ప్రారంభించిన కలెక్టర్, మహిళలు డ్రైవింగ్ శిక్షలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు, మంగళవారం సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు మోటర్ కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు, సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ మహా నగరానికి కూతవేటు దూరంలో ఉందని సంగారెడ్డి నుంచి గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలకు సుమారు 45 నిమిషాల్లో వెళ్లే అవకాశం ఉందన్నారు, హైదరాబాద్ నుండి సంగారెడ్డి, నుండి హైదరాబాద్ ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు రోజు రాకపోకలు సాగిస్తుంటారని వీరిలో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఉన్నారని, వీరు ఎక్కువగా క్యాబ్లో ప్రయాణిస్తుంటారని అలాంటి వారికోసం మహిళా క్యాబ్ డ్రైవర్లు ఉంటే భద్రత తో కూడిన ప్రయాణం కొనసాగిస్తామన్న ధీమతో ఉంటారని, అలాంటి ఏర్పాట్లు చేయడం కోసం మహిళలకు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు, శిక్షణలో నైపుణ్యం సాధించి ఉపాధి పొందాలని కలెక్టర్ సూచించారు, ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా జిల్లాలో మహిళలకు కుట్టు శిక్షణ, ఎంబ్రాయిడింగ్, లాంటి ఎన్నో రకాల శిక్షణలు ఇస్తున్నప్పటికీ మొట్టమొదటిసారిగా కార్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభించాలని సూచించగానే వెంటనే డ్రైవర్లను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు, శిక్షణకు హాజరయ్యే మహిళకు అవసరమైన అన్ని ఏర్పాట్లు డి ఆర్ డి ఏ ద్వారా చేపట్టాలని పిడిని కలెక్టర్ ఆదేశించారు, మహిళలు శిక్షణలో ఉందన్నారు, శిక్షణకు హాజరయ్యి మహిళకు అవసరమైన అన్ని ఏర్పాట్లు డి ఆర్ డి ఏ ద్వారా చేపట్టాలని పిడిని కలెక్టర్ ఆదేశించారు, మహిళలు శిక్షణలో నైపుణ్యం సాధించి తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కలెక్టర్ సూచించారు, తద్వారా తమ కుటుంబాలు మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ అన్నారు, ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ జ్యోతి, ఎస్బిఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ వంగా రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment