బోధన్ రూరల్,డిసెంబర్17:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్ పల్లి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుడు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా అభాగ్యులకు, వ్యవసాయ కూలీలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, సెక్రటరీ గణపతి రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్, సాంబి రెడ్డి, శ్రీనివాసరాజు, చక్రవర్తి, నాయిని కృష్ణ, లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు .
