వేములపల్లి,జనవరి17(తెలంగాణ ఎక్స్ ప్రెస్) మండల పరిధిలోని లక్ష్మీదేవిగూడెం గ్రామంలో బుధవారం శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి మాలాదరణ స్వాములు మరియు భక్తులు అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామం లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో సూర్య కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తి పాటలతో గ్రామం లోని పురవీధుల లో ర్యాలీ నిర్వహించారు.అయోధ్య శ్రీరామమందిర అక్షింతలను, రామమందిర ఫోటో,కరపత్రము ను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దీక్షా స్వాములు భక్తులు మాట్లాడుతూ అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని పూజిత అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామూ. ఆని ఆ శ్రీరాముని ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వాములు భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గడపగడపకు అయోధ్య రామయ్య అక్షింతలు పంపిణీ
59
previous post