బోధన్ రూరల్,ఫిబ్రవరి27:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలోని ఇందూర్ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగావిద్యార్థిని,విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లైన్స్ డిస్టిక్ గవర్నర్ వేమూరి లక్ష్మీ హాజరైమాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు ఇందూరు హైస్కూల్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగనాథ్, పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్, హెచ్ఎం రామారావు, ప్రైమరీ హెచ్ఎం సుధారాణి, అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జి స్వాతి, తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణకు మారుపేరు ఇందూర్ హైస్కూల్
61