నిజాంసాగర్ జనవరి18( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఉమ్మడి రాష్ట్రాల వీర శైవలింగాయత్ ధర్మ ప్రచార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కామారెడ్డి జిల్లా వీర శైవ లింగాయత్ అధ్యక్షులు కే. దిగంబర్ ను గురువారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని దిగంబర్ ను కామారెడ్డి జిల్లా వీర శైవ లింగాయత్ కార్యదర్శి మల్లప్ప పటేల్ కలిశారు.ఈ సందర్భంగా దిగంబర్ ను శాలువకప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లింగాయత్ కుటుంబాలను లింగాయత్ ధర్మాన్ని పాటించే విధంగా తమ వంతు కృషి చేస్తానన్నారు.బసవేశ్వరుని స్పూర్తిగా తీసుకుని కులమతాలకతీతంగా సమాజసేవ చేస్తామని తెలిపారు. సన్మాన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ నాయకులు బి.గంగారాం పాల్గొన్నారు.