ఎల్లారెడ్డి, డిసెంబర్ 16,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్ తాండా కు చెందిన గిరిజన విద్యార్థి ధరావత్ శేఖర్ జాతీయ స్థాయి సౌత్ జోన్ వాలీబాల్ టోర్నమెంట్ కు ఎంపికైనట్లు తాండా వాసులు , సోమవారం తెలిపారు. శేఖర్ డిచ్ పల్లి తెలంగాణ యూనివర్శిటీ లో ఎం బీ ఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నారని, ఈ నెల 13 వ తేదిన సౌత్ జోన్ ఇంటర్ కాలేజి వాలీబాల్ టోర్నమెంట్, తెలంగాణ యూనివర్శిటీ క్యాప్టెన్ గా విజయం సాధించి, జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కు ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల 18 వ తేది నుంచి 22 వ తేది వరకు కేరళ రాష్ట్రంలో జరుగనున్న జాతీయ స్థాయి సౌత్ జోన్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరి వెళ్లినట్లు తండాకు చెందిన ధరావత్ శేఖర్ మిత్రులు తెలిపారు. జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో సైతం రాణించి తాండా కు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు.
