Home తెలంగాణ జర్నలిస్ట్ కేపీ”ని మర్యాద పూర్వకంగా కలుసుకున్న ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం

జర్నలిస్ట్ కేపీ”ని మర్యాద పూర్వకంగా కలుసుకున్న ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ డిసెంబర్

షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా (కెపి) ని మంగళవారం సాయంత్రం షాద్ నగర్ ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం నూతన అధ్యక్షుడు జి రాజు అలియాస్ సిద్ధాపూర్ రాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈరోజు జరిగిన ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా అధ్యక్షుడు రాజు తదితర గ్రామీణ వైద్యులు జర్నలిస్ట్ కేపీని కలుసుకోగా అధ్యక్షుడు రాజును శాలువాతో గౌరవంగా సన్మానించారు. గ్రామీణ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని జర్నలిస్ట్ కేపీ సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజల ఆరోగ్యల సంరక్షణ కోసం గ్రామాల్లో తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ సమాజంలో ధనవంతులు వైద్యం ఎంతో గొప్పదని అత్యవసరంగా రోగికి ఉపశమనం కల్పించే బాధ్యత గ్రామీణ వైద్యులదని సూచించారు. జి రాజు గెలుపొందడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జి రాజు ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం నాగుల రాజ్ కుమార్ నెహ్రూ పవర్, మహేష్, షకీల్, హాజీ, ఆంజనేయులు, అంజయ్య, వెంకటేష్, కనకాచారి, లీగల్ అడ్వైజర్ మదన్మోహన్, బాలకృష్ణ, షాబాద్ వెంకటేశ్వర రెడ్డి, ఉపేందర్, పాండ, షాబాద్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment