Home తాజా వార్తలు స్వాతంత్ర్య సమరయోధుడు జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్థంతి

స్వాతంత్ర్య సమరయోధుడు జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ వర్థంతి

by Telangana Express

మంచిర్యాల, జనవరి 30, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): స్వాతంత్ర్య సమరయోధుడు జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (155) వర్థంతి సందర్బంగా గాంధీ విగ్రహానికి మంగళవారం పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు.

అమర వీరుల త్యాగాలను గుర్తుచేసుకొని, అమరులైన వారికి నివాళి అర్పించడంతో పాటు దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ నాయకులకు, మహానీయులకు వినమ్రంగా వందనం చేశారు. దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలి. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2వ గుజరాత్ లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. గాంధీ తండ్రి కరంచంద్ గాంధీ, తల్లి పుతలీ బాయి. గాంధీ చదువు పోర్ బందర్ లోను, రాజ్‌కోట్ లోను కొనసాగింది. 19సంవత్సరాల వయసులో 1888లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. గాంధీ బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అ కాలములోనే చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి.1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు. దేశంలో బ్రిటిష్ వారు జరుపుతున్న ఆగడాలను సహించలేక అహింసా వాదంతో స్వాతంత్ర్యపోరాటం సాగించిన మహనుభావులు. ప్రజలు గాంధీజీ జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసా గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము, ఆయుధాలు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటిన ఆ మహాత్ముడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహము, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జనవరి 30, 1948 స్వర్గస్తులైనారు. మన మందరం స్వాతంత్ర్య సమరయోధుల అడుగుజాడలలో నడుద్దామని కోరుకోవాలి. విద్యార్థులకు కాలుష్యం పై, ఆరోగ్యం పై, అవగాహణ కలిపించారు. ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు, నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని, నీళ్ళు శరీరానికి తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని తెలిపారు. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ అలవర్చుకొని దేశ భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను పాటించి దేశాభివృద్ధికి తోడ్పడాలని గాంధీజీ కోరారు. ఈ కార్యక్రమంలో నందు నాయక్ దుమల్ల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment