Home తాజా వార్తలు మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు దత్త జయంతి ఆహ్వానం…

మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు దత్త జయంతి ఆహ్వానం…

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 12, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఈనెల 15 న దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించే శ్రీదత్త జయంతి వేడుకలకు హాజరు కావాలని, గురువారం ఎల్లారెడ్డి కి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భగా ఆలయ కమిటీ సభ్యులు తులసీదాస్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణ శివారులో గల దత్తగిరి ఆశ్రమంలో ఇటీవల ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని తెలిపారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా పలు వేడుకలు నిర్వహిస్తున్నామని వేడుకలకు హాజరు కావాల్సిందిగా మాజీ ఎమ్మెల్యేను ఆహ్వాన పత్రిక అందజేసి కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్, దయాకర్ రోహిత్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment