Home తాజా వార్తలు ఓయూ నుంచి పీహెచ్​డీ పట్టా సాధించిన దైద వీరయ్య

ఓయూ నుంచి పీహెచ్​డీ పట్టా సాధించిన దైద వీరయ్య

by Telangana Express

మిర్యాలగూడ డివిజన్ జనవరి 5 తెలంగాణ ఎక్స్ ప్రెస్: నల్గొండ జిల్లా నందిపాడుకు చెందిన దైద వీరయ్య ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ పట్టాను పొందారు. ఆర్ట్స్ కాలేజీలోని తెలుగు డిపార్ట్ మెంట్ కు చెందిన వీరయ్య.. ‘డక్కలి కుల విజ్ఞానం – సమగ్ర అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేశారు. తెలుగు శాఖ ఆచార్యులు దాశరథుల నర్సయ్య పర్యవేక్షణలో ఈ పరిశోధన సాగింది. తెలుగుశాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ కాశీం ఆధ్వర్యంలో తన ప‌రిశోధ‌నా ప‌త్రాన్నిఉస్మానియా వ‌ర్సిటీకి స‌మ‌ర్పించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలానికి చెందిన వీరయ్య.. తన స్వగ్రామమైన నందిపాడులో ప్రాథమిక విద్యాభాస్యాన్ని పూర్తి చేశారు. పదో తరగతిని మిర్యాలగూడలోని బకాల్ వాడీలో, సాకేత జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ను పూర్తి చేశారు. నాగార్జున కాలేజీలో డిగ్రీని పూర్తి చేయగా… ఎంఏ తెలుగును ఉస్మానియా వర్శిటీలోని ఆర్ట్స్ కాలేజీలో పూర్తి చేశారు. నెట్ (జాతీయ అర్హత పరీక్ష)లో క్వాలిఫై అయిన వీరయ్య… జేఆర్ఎఫ్(జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్)కు ఎంపికయ్యారు. కుప్పంలోని ద్రావిడ యూనివర్శిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా పని చేశారు. ఓయూలోని తెలుగు శాఖలో పీహెచ్డీ ప్రవేశం పొంది.. తన పరిశోధనను పూర్తి చేశారు. వీరయ్య రాసిన పదికిపైగా ఆర్టికల్స్… పలు జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. 2019లో లాంగ్వేజ్ పడిట్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన వీరయ్య.. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలోని సూరారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉస్మానియా వర్శిటీ వేదికగా తెలంగాణ ఉద్యమంతో పాటు పలు సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రను పోషించారు.
అత్యంత కింది స్థాయి నుంచి వెళ్లి వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా వర్శిటీ నుంచి పీహెచ్డీ పట్టాను సాధించటంపై వీరయ్య తల్లిదండ్రులు నర్సయ్య, చంద్రకళ ఆనందం వ్యక్తం చేశారు. పట్టాను పొందిన వీరయ్యకు యూనివర్శిటీ ప్రొఫెసర్లు, తోటి ఉపాధ్యాయులు, స్నేహితులు, నందిపాడు గ్రామస్తులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు. తనకు పీహెచ్డీ పట్టా రావటంపై దైద వీరయ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు. ” వందేళ చరిత్ర గల ఓయూలో పీహెచ్డీ పూర్తి చేయటం గర్వంగా ఉంది. కిందిస్థాయి నుంచి సాగిన నా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా జన్మినిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఎప్పటికి రుణపడి ఉంటాను. సమాజాభివృద్ధిలో ఎల్లప్పుడూ నా వంతు పాత్ర పోషిస్తాను. విద్యార్థుల భవిష్యత్తుకై నిరంతరం కృషి చేస్తాను” అని తెలిపారు.

You may also like

Leave a Comment