మిగిలిన రైతుబంధు డబ్బులను వెంటనే చెల్లించాలి
ఏఐకేఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఎండి సర్దార్.
రేగోడు జులై 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్, తెలంగాణ వ్యాప్తంగా పానకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తుంది కావున మిగిలిన రైతుబంధు డబ్బులను వెంటనే విడుదల చేయాలని, మరియు లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయాలని ఆల్ ఇండియా కిసాన్ సభ మెదక్ జిల్లా అధ్యక్షులు ఎండి సర్దార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇచ్చే రైతు బంధు పథకం డబ్బులు సుమారు 5 ఎకరాల వరకు ఇచ్చారని, మిగిలిన రైతులకి డబ్బులను వెంటనే చెల్లించాలని రైతు సంఘం డిమాండ్ చేస్తుందనీ, ఒక నెల నుండి ప్రారంభమైన ప్రక్రియ, నేటికీ పూర్తి కావాల్సి ఉండగా పూర్తికానందున రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో గురవుతున్నారని,వాన కాలం సీజన్ ప్రారంభమై నెల 20 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మిగిలిన రైతులకి రైతుబంధు డబ్బులను విడుదల చేయాలని, అలాగే ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తూ న్నప్పటి కీకేవలం 40 వేల వరకే మాఫీ ఇవ్వడం జరిగిందనీ, అది కూడా పూర్తిగా జరగలేదని, ఈ మాఫీ చేసిన డబ్బులకు సంబంధించి రైతులకు కూడా ఇప్పటివరకు సమాచారం లేదని ఇప్పటివరకు మాఫీ చేసిన డబ్బులను బ్యాంకర్లు, ప్రతి బ్యాంక్ నోటీస్ బోర్డ్ పైన పెట్టి, సంబంధిత రైతులకి రుణ మాఫీ దృవపత్రం ఇవ్వవలసి ఉందని, బ్యాంకర్ల ముఖ్యంగాఇది గమనించాలనీ,అలాగే తక్కిన లక్ష రూపాయల వరకు ఉన్న పంట అప్పు లను ప్రభుత్వం వెంటనే మాఫీ చేసి రైతు ఖాతాలను జమ చేసి, ఈ ఋణ భారాన్ని తగ్గించి, రైతులను ఆదుకోవాలని, ఇప్పటికే లక్ష రూపాయల పంట రుణాలు ఉన్న రైతులు, వడ్డీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నారనీ. లక్ష వరకు ఉన్న అసలు రుణం, ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లిస్తు రినివల్ చేస్తున్నా రుణాలు లక్షకు 1,50,000 వరకు పైగా దాటి ఉన్నవనీ దీనితో రైతులు తీవ్ర ఆవేదనతో, నిస్సహాయ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని అన్నారు,కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మిగిలిన రైతులకి రైతుబంధు డబ్బులను వెంటనే చెల్లించి, లక్ష వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని అన్నారు.