Home తాజా వార్తలు ఎన్టీఆర్ సంక్షేమ పథకాల సృష్టికర్త : ఎన్టీఆర్ కు పలువురు ఘన నివాళి

ఎన్టీఆర్ సంక్షేమ పథకాల సృష్టికర్త : ఎన్టీఆర్ కు పలువురు ఘన నివాళి

by Telangana Express

కమ్మ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ…

మిర్యాలగూడ జనవరి 18 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుజాతి గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి పురస్కరించుకొని మహనీయునికి గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు లేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. మాజీ జడ్పీ చైర్మన్ సిడి రవికుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సంక్షేమ పథకాల సృష్టికర్త అని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పనిచేసిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు ప్రసాద్, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంగరాల మట్టయ్య లు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ వల్లే రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగానిలిచిపోయాయని అన్నారు.

బిజెపి మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జ్ సాధినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదల పెన్నిధిగా నిలిచారని, ఆయన సేవలుచిరస్మరణీయమన్నారు. తుంగపాడు మాజీ సర్పంచ్ చిలుకూరి సత్యనారాయణ మిర్యాల మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పాతూరి ప్రసాదరావులు మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కిందన్నారు.

కమ్మ సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో నాగార్జునసాగర్ టిడిపి ఇన్చార్జ్ మువ్వ అరుణ్ కుమార్, ముక్కాపాటీ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ గంధం రామకృష్ణ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, కమ్మ సంఘం నాయకులు, ఎన్టీఆర్ అభిమాన సంఘల నాయకులు వి చలపతిరావు, టిడిపి మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ వడ్డే బోయిన శ్రీనివాస్, జడ రాములు యాదవ్, రాములు గౌడ్, రామలింగ యాదవ్, చల్ల వెంకన్న, మాన్య నాయక్, సైదా నాయక్, తిరందాస్ విష్ణు, పూనాటి లక్ష్మీనారాయణ, రామఅవతారం, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు నసీరోద్దీన్ బాబా, మండల కన్వినర్ చిలకల వెంకన్న , పి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉప్పలపాటి గోపాల కృష్ణ, రాష్ట్ర దళిత అధికార ప్రతినిధి నూకపంగు కాశయ్య, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి గంధం శ్రీనివాస్, ఐటీడీపి నాగేందర్, ఇండ్ల గణేష్, మేక అంజి, ఏచూరి అనంతరాములు, పోట్ల శంకరావు, పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షలు చావ్వా వెంకటేశ్వర్లు, గర్దాస్ ప్రభాకర్, బొట్టు వెంకన్న , కమ్మ సంఘం నాయకులు కూనాల కృష్ణ, బిఆర్ఎస్ 6 వార్డు ఇంచార్జ్ సాధినేని శ్రీనివాసరావు, రమేష్, పచ్చ రమేష్, పాల్గొన్నారు.

You may also like

Leave a Comment