Home తాజా వార్తలు సిపిఐ “99”వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జెండా ఆవిష్కరణ చేసిన బత్తుల బాబు

సిపిఐ “99”వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జెండా ఆవిష్కరణ చేసిన బత్తుల బాబు

by Telangana Express

రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ

సైదాపూర్ డిసెంబర్ 26
((తెలంగాణ ఎక్స్ ప్రెస్ )

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో ప్రతి పేదవానికి అండగా ఎర్రజెండా నిలుస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు అన్నారు 1925 డిసెంబర్ 26న పురుడు పోసుకున్న సిపిఐ పార్టీ నేడు 99వ వసంతంలో అడుగుపె డుతున్న సందర్భంగా ప్రతి పల్లెలో ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా సిపిఐ ఎర్ర జెండాలను ఎగరవేయాలని కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు అనునిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంతో పని చేసుకుంటూ, ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు నాడు భారతదేశ స్వా తంత్ర ఉద్యమంలో బ్రిటిష్ తెల్లదొర లకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర సిపి ఐ పార్టీది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొట్ట మొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ కావాలని పార్ల మెంట్లో నినదించిన పార్టీ సిపిఐ భూమికోసం భుక్తి కోసం మాతృదేశ విముక్తి కోసం సాగినటువంటి తెలం గాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకారులకు వ్యతిరేకంగా ఎంతో మంది భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నాయకులు పోరాడిన చరిత్ర సిపిఐ పార్టీది.దున్నేవాడిదే భూమి నినాదంతో లక్షల ఎకరాల భూమిని పేదవాళ్లకు పంచిపెట్టిన చరిత్ర సీపీఐ పార్టీది, ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికు లకు, కర్షకుల పక్షాన నిలబడి అనేక పోరాటాల నిర్వహించి హక్కులను సాధించిన చరిత్ర సిపిఐది,పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అనే నినాదంతో ప్రపంచవ్యాప్తం గా ఎర్రజెండా ఉనికిని పెంచుకుంటూ పోతుంది ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించు కోవాలని పార్టీ కార్యకర్తలకు
నాయకులకు పిలుపునిస్తు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు, మాజి ఎంపీటీసి ఒజ్జ కొమురయ్య, నాయకులు జెడల. రాజేశం, నాలువల రవి, లంకడాసరి కళ్యాణ్, బాసవేని శ్రీనివాస్, ఒడ్నాల వెంకటేశ్, దాసరి. రజినీ కాంత్, సోమల బీరయ్య,,

You may also like

Leave a Comment