వెంటనే స్పందించి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి
–వెంటనే స్పందించి గ్రామానికి వచ్చిన అధికారులు
పటాన్చెరు ఆగస్టు 02 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి)-;సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన జిన్నారంలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎస్సీ కాలనీ సంబంధించినటువంటి మిషన్ భగీరథ వాటర్ అయితే వస్తుంది వాటర్ నల్లల ద్వారా ఇంటింటికి వచ్చే వాటర్ లో కలుషితపు నీరు రావడం జరుగుతుంది. ఇది తెలుసుకున్న గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి వెంటనే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది వారు కూడా స్పందించే ఈరోజు అధికారులు జిన్నారం గ్రామానికి రావడం జరిగింది డి శ్రీనివాసరావు ఎంపీడీవో రాములు ఏ ధరణి స్థానిక సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి వార్డ్ నెంబర్ ఏర్పుల లింగం నాయకులు నర్సింగరావు నిఖిల్ గౌడ్ ఎస్సీ కాలనీ వాసులు గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామ సిబ్బంది పాల్గొని అందరూ కలిసి ప్రతి ఇంటింటికి తిరిగి సమస్యను పరిష్కరించడానికి ప్రతి ఇంటి నుండి వాటర్ ను సేకరించి నర్సాపూర్ ల్యాబ్ కు పంపించడం జరిగింది రిజల్ట్ వచ్చిన వెంటనే చర్యలు చేపడతామని డి శ్రీనివాసరావు తెలపడం జరిగింది వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు