మద్దూరు డిసెంబర్ 4 తెలంగాణ ఎక్స్ప్రెస్
కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మధుర్ పాత బస్టాండ్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణప శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి దొరల పాలన నుంచి విముక్తి లభించింది అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మహాదేవ్, చికిని పురుషోత్తం, మహిముద్, ముది శ్రీను, కృష్ణ, సూరిబాబు, చికిని మహేష్, మనోహర్, జములప్ప, బైరం కనకప్ప, ప్రవీణ్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు