Home తాజా వార్తలు పేదింటి ఆడబిడ్డల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

పేదింటి ఆడబిడ్డల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

by Telangana Express
  • పెండ్లి సహాయం చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి…
  • 5 మండలాల్లో 501 చెక్కుల పంపిణీ…

మక్తల్, ఫిబ్రవరి 26:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): పేదింటి ఆడబిడ్డల సంక్షేమం కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మఖ్తల్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో సోమవారం 501 చెక్కులు అందించామని, 5 కోట్ల లక్షా 58 వేల రూపాయలు సాయంగా ప్రభుత్వం అందించిందని తెలిపారు.
మఖ్తల్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో 181 కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు , మాగనూరులో 32 చెక్కులు, క్రిష్ణ లో 121 చెక్కులు, ఉట్కూర్ లో 103 చెక్కులు, నర్వలో 64 చెక్కులు
లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ప్రభుత్వం మారినా పేద ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న పథకాలను ఏమాత్రం ఆపలేదని, ప్రస్తుతం కొనసాగిస్తున్నామని, రాబోయే రోజుల్లో లక్షా 116 రూపాయలకుతోడు హామీ ఇచ్చిన విధంగా తులం బంగారం సైతం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వీటితోపాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరుగ్యారెంటీలను ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని అన్నారు. లబ్దిదారులు ఆర్థిక సాయంను అనవసర ఖర్చులకు వినియోగించరాదని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సువర్ణరాజ్, మండలాధ్యక్షుడు గణేశ్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ రవికుమార్, సీనియర్ నేతలు కోళ్లవెంకటేశ్, కట్టా సురేశ్ గుప్తా, మాగనూరు మండలాధ్యక్షుడు ఆనంద్ గౌడ్, కావలి ఆంజనేయులు, మందుల నరేందర్, నూరుద్దీన్, అబ్దుల్ రెహమాన్, ఫయాజ్, వాకిటి శ్యామ్, వాకిటి హన్మంతు, కల్లూరిగోవర్దన్, వార్డ్ కౌన్సిలర్లు మొగులప్ప, చీరాల సత్యనారాయణ, అన్ని మండలాల అధ్యక్షులు, నేతలు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment