మేడ్చల్ గడ్డమీద గులాబి జెండా ఎగరవేయడమే నా ద్యేయం…రాజా నాయక్.
ఘట్కేసర్,నవంబర్ 01(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ శివాస్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజా నాయక్, విక్రమ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 500 మంది యువత మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజానాయక్ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డిని అత్యధిక బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. రానున్న రోజుల్లో మరో 500 మంది యువత మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చేరుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
