Home తాజా వార్తలు పేదల కోసం కృషి చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్

పేదల కోసం కృషి చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్

by Telangana Express

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేడ్మా బోజ్జు పటేల్

మంచిర్యాల, డిసెంబర్ 19, (తెలంగాణ ఎక్స్ ప్రెస్) : పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెేడ్మా బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా, జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రా నియోజకవర్గంలో పేదల అభివృద్ధి కోసం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి, ముందుకు సాగిందన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల, రైతుల కష్టాలను ఆలోచించి, కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజా ప్రభుత్వంగా మార్చిందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీ హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యార్యంటిలను కాంగ్రెస్ పార్టీ పక్కగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల తాసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో అరుణ రాణి, జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్, ఎంపీపీ మాదాడి సరోజన, పిఎసిఎస్ చైర్మన్ శీలం రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజ్జు, ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, పట్టణ అధ్యక్షులు దుమాల రమేష్, పొనకల్ సర్పంచ్ జక్కు భూమేష్, జన్నారం ఎంపీటీసీ రీయాజోద్దీన్, ఫశీవుల్లా, సిపిఐ కళీందర్ ఖాన్, సిపిఐ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment