బోధన్ రూరల్,ఏప్రిల్28:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)సాలురా మండల కేంద్రంలోని ఖాజాపూర్ గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సాలు రా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందర్న రవి, సీనియర్ నాయకులు అల్లే రమేష్, శ్రీనివాసరావు,చిద్రపు అనిల్,సొ క్కం రవి, రాములు, లస్మన్న,శంకర్, లక్ష్మణ్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఖాజాపూర్ లో కాంగ్రెస్ ప్రచారం
48
previous post