మధిర డిసెంబర్ 19(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) మధిర లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ MPC విద్యార్థి n పీట్ల.గోపి. పాల్వంచలో జరిగిన కబడ్డీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచి అండర్-17 రాష్ట్ర స్థాయి జట్టుకి ఎంపిక అవటమే కాకుండా ఖమ్మం జిల్లా కబడ్డీ జట్టుకి* కెప్టెన్ గా ఎంపికయిన సందర్బంగా అభినందనలు తెలిపిన అధ్యాపకులు
ఈ సందర్బంగా ప్రిన్సిపల్ జై దాస్ మాట్లాడుతూ బాల్యం నుండే క్రీడల పట్ల ఉన్న మక్కువతో ప్రత్యేకంగా కబడ్డీ ఆటగాడిగా అల్ రౌండర్ గా రాణిస్తూ, పట్టుదల,శ్రమతో ఖమ్మం జిల్లా అండర్ -17 జట్టుకి ఎంపిక అయిన పీట్ల.గోపి భవిష్యత్లో మరెన్నో అవార్డులు గెలిచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. NSS PO బి తౌరియా. మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.