మిర్యాలగూడ నవంబర్ 21 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ లోగల
అయ్యప్పస్వామి గుడిలో నిత్య అన్నదానం కార్యక్రమంలో హాజరై భక్తులకు స్వయంగా వడ్డించి సేవాకార్యక్రమాలు చేస్తున్న వారిని గౌరవించాల్సిన అవసరం భక్తులకు ఉండాలని, నిర్విరామంగా ఈ అన్నదాన వితరణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ముక్కపాటి వెంకటేశ్వర రావు, మాశెట్టి శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, రాము, లక్ష్మీ నారాయణ, నాయుడు స్వామి, జయరాజు, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన భాస్కర స్వామి కి సంతాపం తెలిపారు.