యంసీపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కామ్రేడ్ మైదంశెట్టి రమేష్ పిలుపు
శేరిలింగంపల్లి, జనవరి 29(తెలంగాణ ఎక్సప్రెస్ ):
పిబ్రవరి 14న అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ ద్వితీయ వర్ధంతి ని జయప్రదం చేయాలని యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కామ్రేడ్ మైదంశెట్టి రమేష్ పిలుపునిచ్చారు.సోమవారం స్టాలిన్ నగర్ లో జరిగిన యం సి పి ఐ యు మియాపూర్ డివిజన్ కమిటీ సమావేశానికి ముఖ్యతిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాలకు ఆశాజ్యోతి పేదల పెన్నిధి తాండ్ర కుమార్ అని అన్నారు. ఆయన ద్వితీయ వర్ధంతి నీ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద,పాసిస్ట్ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ మియాపూర్ లో రాష్ట్ర సదస్సు జరుపుతున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను హజరు పరుస్తూ పెద్దఎత్తున కార్యక్రమాన్ని జరుపుతున్నామని తెలియజేశారు. కామ్రేడ్ తాండ్ర కుమార్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.డివిజన్ కమిటీ సభ్యులు యం చందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ నాయకురాలు పి.భాగమ్మ,మియాపూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఇ.దశరత్ నాయక్,డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు గూడ లావణ్య, జి శివాని, జి లలిత,డి నర్సింహా,బి అరుణ,గౌసియా బేగం,ఇషాక్, నాగభూషణం, టీ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.