Home తాజా వార్తలు బదిలీలు అయిన వెళ్ళని కంప్యూటర్ సిబ్బంది

బదిలీలు అయిన వెళ్ళని కంప్యూటర్ సిబ్బంది

by Telangana Express

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా జనవరి 29:(తెలంగాణ ఎక్స్ ప్రెస్):మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్న తాసిల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్నా కంప్యూటర్ ఆపరేటర్లు దృవ పత్రాలు సకా లంలో ఇవ్వకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని,అప్పట్లో ఉన్నత అధికారులకు పిర్యాదు చేయగా విచారణ చేసి బదిలీలు చెయ్యడం జరిగింది.కానీ కాప్రా తహశీల్దార్ కార్యాలయం లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ బదిలీ అయిన కానీ ఇక్కడ నుండి వెళ్ళడం లేదు.ఎందుకు అంటే ఇక్కడ ముడుపులు భాగ అందుతున్నాయి కాబట్టీ బదిలీ ఐనా వెళ్లడం లేదు.ఈ కంప్యూటర్ ఆపరేటర్ కి ప్రత్యేక నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా! లేక ముడుపులలో తాసిల్దార్ కి కూడా వాటా ఉందా! అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.మౌనంగా అధికారులు ఎందుకు ఉన్నారో ముడుపుల మీద వున్నా శ్రద్ద ఉన్నత అధికారులు ఇచ్చిన ఉత్తర్వులనీ ఆచరణలో పెట్టడంలో కాప్రా తహశీల్దార్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఉన్నత అధికారుల కి కూడా ముడుపులు అందుతున్నాయి అని ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతున్నది.ఇప్పటికి బదిలీ అయినా వారిని పంపిస్తారో లేకా ఇక్కడ పెట్టుకోని ఉన్నత అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను కాల రాస్తారో వేచి చూడలే.

You may also like

Leave a Comment