నారాయణపేట జిల్లా, ప్రతినిధి, డిసెంబర్ 12 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):గత పద్నాలుగు సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖ లో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని అంతవరకు మినిమం టైం స్కేల్ అందించాలని రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. అందులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం నాడు మొదటిరోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్కు ధర్నా సెంటర్ దగ్గర నిరసన చేపట్టారు. గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసనలో భాగంగా అప్పటి పీసీసీ అధ్యక్షులు గా ఉన్న రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మీ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారనీ గుర్తు చేశారు. మీరు ఇచ్చిన హామీ ని నెరవేర్చాలంటూ నిరవధిక సమ్మె చేపట్టారు. కెజిబివి ఎస్ఓ శాలిని మాట్లాడుతూ మాకు ఉద్యమం ఎంత ముఖ్యమో మా విద్యార్థినిలు భద్రత, బాధ్యత కూడా అంతే ముఖ్యం కావున జిల్లాలోని 11మండలాల కెజిబివి ఉద్యోగులు సమ్మెలో ఉన్నా విద్యార్థినిలకు ఇబ్బందులు కలగకుండా డ్యూటీ టీచర్లు ఉంచి సమ్మెలో పాల్గొనటం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు ఎల్లాగౌడ్, ప్రధాన కార్యదర్శి అల్తాఫ్,ఎస్ఓ లు శాలిని, గంగమ్మ,ఎంఐఎస్ రత్నమాల,సరస్వతి, సిఆర్పి రాజు,శివకుమార్, నారాయణ పవర్,నాగేందర్,పిటిఐ లు వెంకన్న,రఘువీర్,మనోహర్,రాజేష్,రవి, ఐఈఆర్పి తిమ్మప్ప,శ్రీనివాస్ లు పాల్గొన్నారు జిల్లాలోని సిఆర్పి లు,కెజిబివి ఉద్యోగులు, పార్ట్ టైం ఇన్స్ట్రాక్టర్లు,ఎమ్మార్సి ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చేపట్టిన దీక్ష
7
previous post