ఎల్లారెడ్డి, డిసెంబర్ 11,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత కోసం, జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్నారు. బుదవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట జిల్లాలోని అన్ని మండలాల్లో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ, తమకు రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీని నిలబెట్టు కుంటారని పూర్తి విశ్వాసంతో ఉన్న తమకు, ఎలాంటి హామీ ఇవ్వక పోవడంతో రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకుల అదేశాల మేరకు ఈ నెల 10 వ తేది నుండి నిరవధిక సమ్మెను కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేస్తున్నామని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఎంఆర్ సి కార్యాలయానికి విధులకు వెళ్లకుండా నిరవధిక సమ్మె లో పాల్గొనడంతో ఎం ఆర్ సి కార్యాలయాలు తీసేవాళ్ళు లేక తాళాలు పడ్డాయి. రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు నిరవధిక సమ్మెను విరమించబోమని విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు స్పష్టం చేశారు .


