Home తాజా వార్తలు అంగన్ వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు

అంగన్ వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు

by Telangana Express

బీబీపేట్ ఫిబ్రవరి 3 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) బీబీపేట్ మండలం కోనాపూర్ గ్రామ అంగన్ వాడి కేంద్రంలో శనివారం సామూహిక సీమంత కార్యక్రమం నిర్వహించారు. సెంటర్ నిర్వాహకురాలు మమత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు .గ్రామానికి చెందిన నలుగురు గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయంగా జరిపించే సీమంత కార్యక్రమం అంగన్ వాడి కేంద్రంలో జరిపించడం సంతోషంగా ఉందని గర్భిణీల బంధువులు పేర్కొన్నారు .ఇలాంటి కార్యక్రమాలు జరపడం గొప్ప విషయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ,పరిసర ప్రాంత వాసులు ,తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment