Home తాజా వార్తలు ఈ నెల 17 తో ముగియనున్న గృహజ్యోతి వివరాల సేకరణ

ఈ నెల 17 తో ముగియనున్న గృహజ్యోతి వివరాల సేకరణ

by Telangana Express
  • ఎల్లారెడ్డి డివిజనల్ ఆపరేషన్స్ డిఈ గణేష్

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 15,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

తెలంగాణ రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీ పథకాల్లో బాగంగా “గృహాజ్యోతి ” పథకం కు సంబందించిన వివరాల సేకరణ ఈ నెల 17 తో ముగియనున్నట్లు ఎల్లారెడ్డి డివిజనల్ ఆపరేషన్స్ డీ ఈ సి.గణేష్ తెలిపారు. గురువారం ఆయన గృహజ్యోతీ కింద దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా సిబ్బందితో దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా డీఈ విలేఖరులతో మాట్లాడుతూ… రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న 6 గ్యారంటిల లో ఒకటైన “గృహజ్యోతి” పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాల సేకరణ గడువు గురువారంతో ముగిసింది అని, ఇంకా చాలా మంది లబ్ధిదారులు తమ సిబ్బందికి వివరాలు అందజేయని కారణంగా విద్యుత్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 17 వరకు గడువు పెంచడం జరిగిందన్నారు. లబ్ధిదారులు తమ కరెంటు బిల్లు, ప్రజాపాలన దరఖాస్తు నంబరు, ఆధార్ కార్డు నంబర్, తెల్ల రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు) నంబర్ తో పాటు ఫోన్ నంబర్ ను సంబంధిత విద్యుత్ సిబ్బందికి స్థానిక ఫ్యుజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ లో కానీ ఈ ఆర్ ఓ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. 17 వ తేదీ తర్వాత ఇచ్చిన వివరాలు ” హృహజ్యోతి ” పథకానికి వర్తించదని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు 17 వ తేదీలోగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈ తో పాటు ఫోర్మెన్ గంగారాం, లైన్మెన్ లు లక్ష్మీనారాయణ, నూర్య, సిబ్బంది అరుణ్, ప్రేమ్ తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment