Home తాజా వార్తలు ఫైలేరియా కేసులను గుర్తించుటకు రాత్రిపూట రక్త నమూనా సేకరణ

ఫైలేరియా కేసులను గుర్తించుటకు రాత్రిపూట రక్త నమూనా సేకరణ

by Telangana Express

మంచిర్యాల, ఫిబ్రవరి 29, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రక్త నమూనా సేకరణ చేయడం జరిగిందని, మండల ఆరోగ్య వైద్యురాలు ఉమశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. జన్నారం మండలం ఆరోగ్య కేంద్రం సిబ్బందితో ఇంధన్ పల్లి గ్రామం నందు పైలేరియా కేసులను గుర్తించుటకై రాత్రి పూట రక్త నమూనా సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇంధన్ పల్లి గ్రామం నందు జరిగింది. మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యులు ఈ నమూనా సేకరణ వల్ల పైలేరియా ప్రాథమిక దశలో గుర్తించడం జరుగుతుందన్నారు. మండల ఆరోగ్య అధికారి డాక్టర్ ఉమాశ్రీ, ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమాన్ని, మండలంలోని ఇంధన్ పల్లి గ్రామంలోని ఇంటికి ఫైలేరియా రక్త నమూనా సేకరణ కోసం వెళ్లారు. ఈ సందర్భంగా మండల వైద్యురాలు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా అధికారుల ఆదేశానుసారం గ్రామంలో సుమారుగా 300కు పైగా రక్త నమోనాలు సేకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం నందు హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్ మేల్ అండ్ ఫిమేల్ ఆశా, కార్యకర్తలు, గ్రామ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment