జోగిపేట్ డిసెంబర్ 09:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) జోగిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నాడు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు, మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశానుసారం సీఎంఆర్ఎఫ్ 40 చెక్కులను బాధితులకు అందజేశారు, నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని తమ పార్టీని ప్రాణంగా పెట్టి తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియాగాంధీ కె దక్కిందని, ముందుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాకూరి వెంకటేశం గారు కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు అలాగే, డాకూరి వెంకటేశం మరియు మండల అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ 78వ జన్మదిన పురస్కరించుకొని జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ ప్రకంపనాలు వచ్చిన అన్నింటిని తట్టుకొని తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారుల దశాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చిన దేవత సోనియా గాంధీ అని కొనియాడారు, తల్లి సోనియా అమ్మ కృషి తోనే అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనకు సుసాధ్యం అయిందన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు, సోనియా మీద అభిమానంతోనే, ఆమె త్యాగాలను గుర్తించి, తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని ఇచ్చారన్న గౌరవంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం కట్టబెట్టారు, తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఇందిరమ్మను గుర్తుచేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని వివరించారు, గత ప్రభుత్వం లో నిర్లక్ష్యం చేయబడ్డ అన్ని వర్గాలను గుర్తించి సమ న్యాయం చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో, ఆందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఢకూరి గాలయ్య గారి వెంకటేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్ గారు, కౌన్సిలర్లు, నాగరాజు, దుర్గేష్, చందర్, హరికృష్ణ గౌడ్, ఆందోల్ మండల అధ్యక్షులు శివరాజ్, మాసన్ పల్లి సర్పంచ్ అశోక్, శరత్ బాబు, శేఖర్, డాకూరి శ్రీనివాస్, చిట్యాల మధు, గుర్రపు కృష్ణ, ఉలువల సతీష్, గోవర్ ఆలీ, నాగరాజ్, నందు, కాలేదు, అబ్బాస్, మరియు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జోగిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు
6
previous post