కామారెడ్డి, సెప్టెంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని లింగంపేట మండలం లింగంపల్లి కుర్ధు బ్రిడ్జిని, బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎనుముల రేవంత్ రెడ్డి వీక్షించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులు, వంతెనలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్మెన్లు కుడుముల సత్యనారాయణ, పద్మ శ్రీకాంత్, కాంగ్రెస్ నేతలు కురుమ సాయిబాబా, నునుగొండ శ్రీనివాస్, విద్యాసాగర్, వినోద్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు.
