తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి తోపాటు హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా చిగురుమామిడి
మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచపేల్చి స్వీట్ పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం కంది తిరుపతిరెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాల పైన తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రికి . ఈ ప్రాంత ప్రజల కొరకు నిరంతరం పనిచేసే జననేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు. చిగురు మామిడి మండలంలో అన్ని గ్రామాల పేద వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు అన్ని అందించేందుకు ముందుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉపాధ్యక్షులు ఓరుగంటి భారతీదేవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి షాబుద్దీన్, సుందరగిరి గ్రామ సర్పంచ్ శ్రీ మూర్తి రమేష్ ,యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిల్లెల రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ బోయినీ వేణు గోపాల్, వడియాల సంతోష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు శివకుమార్, ఎలగందుల లక్ష్మణ్, వడియాల సుధాకర్ రెడ్డి, కొండపురం గ్రామ అధ్యక్షుడు పూతరేణి రాజు, యూత్ గ్రామ అధ్యక్షుడు వర్కోల్ శివకుమార్, కవంపల్లి సంజీవ్ వివిధ గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
రేవంత్ కు సీఎంపొన్నం కు మంత్రి పదవి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు
55
previous post