Home తాజా వార్తలు సీఎం కప్ మండల స్థాయికబడ్డీ విజేత భిక్కనూర్ జట్టు…ఆత్మీయ సన్మానం చేసిన గ్రామ మాజీ ఉప సర్పంచ్

సీఎం కప్ మండల స్థాయికబడ్డీ విజేత భిక్కనూర్ జట్టు…ఆత్మీయ సన్మానం చేసిన గ్రామ మాజీ ఉప సర్పంచ్

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 12,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

సీఎం కప్- 2024 మండల స్థాయి విభాగంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో మండలంలోని భిక్కనూరు గ్రామ జట్టు విజేతగా నిలిచింది. గురువారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆట స్థలంలో నిర్వహించిన కబడ్డీ పోటీలలో మండలంలోని బ్రాహ్మణపల్లి జట్టుపై విజయం సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. వీరికి స్థానిక ఆర్డిఓ, మండల ప్రత్యేక అధికారి మన్నె ప్రభాకర్, ఏఎంసీ చైర్ పర్సన్ మారెడ్డి రజిత వెంకట రామిరెడ్డి లు బహుమతులను అందజేశారు. తమ గ్రామ యువకులు కబడ్డీ పోటీలలో మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం పట్ల బిక్కనూరు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి అభినందిస్తూ, మున్ముందు మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామ మాజీ ఉప సర్పంచ్ గోనె శ్రీకాంత్ సైతం కబడ్డీ క్రీడాకారులకు ఒక్కొక్కరికి శాలువా కప్పి ఆత్మీయ సన్మానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. గెలుపొందిన కబడ్డీ టీమ్ లో క్రీడాకారులు చంటి, నరేష్, విద్యాసాగర్, ఎప్రా, ప్రవీణ్, ప్రసాద్, అరుణ్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అల్లం మహేందర్ కుమార్, ఎంపీడీవో అతినారపు ప్రకాష్, పీ ఈ టీలు, భిక్కనూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న, కారోబార్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment