ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
కొడిమ్యాల అక్టోబర్ 9 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
జిల్లా పరిషత్ హై స్కూల్ చెప్యాల పాఠశాల లో ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపు కోవడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటస్వామి మాట్లాడుతూ మన తెలంగాణ లో మహిళలు పువ్వులనే గౌరీ మాత గా భావించి పూజించే మహిళలందరు ఆటపాటలతో సంతోషంగా జరుపుకొనే ఏకైక పండగ బతుకమ్మ పండగ అని అన్నారు. ఇట్టి సంబరాలలో అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్ధినులు పాల్గొని బతుకమ్మ పాటలతో అలరించారు. ఇందులో అంగన్వాడీ సూపర్వైజార్ సుధారాణి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మునీశ్వరి,జ్యోతి, అంజలి ,తులసి, మమత ఉపాధ్యాయులు, మహిళా పోషకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.