పలువురిపై కోడి కత్తులతో దాడి ఆరుగురికి తీవ్ర గాయాలు.ముగ్గురు సీరియస్..
చెన్నూర్ ఏప్రిల్ 8 మంచిర్యాల జిల్లా (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం లోని ఎమ్మెల్యే కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన నెన్నెల కిరణ్ అనే వివాహితుని “రిసెప్షన్” డీజే డాన్స్ లో ఘర్షణ చోటు చేసుకుంది.

విందు జరుగుతున్న సమయంలో డ్యాన్స్ విషయంలో పలువురు యువకుల మధ్య ఘర్షణ జరుగగా అధికాస్త కత్తుల దాడికి దారి తీసింది.

మద్యం మత్తులో ఆకుల శ్యామ్ అనే వ్యక్తి రెండు చేతులు కోడి కత్తి కట్టుకొని దాడి చేయగా పెళ్ళికొడుకు తో సహా ఐదుగురు యూవకులకు గాయాలు అయ్యాయి.

గాయాలపాలైన వారిని బందువులు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… అందులో తీవ్రంగా గాయాలైన నన్నెల విజయ్ కుమార్, చింతకింది చరణ్, తుమ్మ చంద్రశేఖర్ అనే ముగ్గురిని వైద్యులు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.