Home తాజా వార్తలు ఎల్లారెడ్డి లో భక్తి శ్రద్ధలతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు…సిఎస్ఐ, ఏద వర్షిప్ , షోలెం రాజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు…

ఎల్లారెడ్డి లో భక్తి శ్రద్ధలతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు…సిఎస్ఐ, ఏద వర్షిప్ , షోలెం రాజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు…

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 25,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకుని, బుధవారం పట్టణంలోని సి ఎస్ ఐ (సెయింట్ ఆండ్రూస్) చర్చి, మున్సిపల్ పరిధిలోని 4 వ వార్డు కింద గల బాలాజీ నగర్ తాండా సమీపంలో గల ఏద వర్షిప్ చర్చి, 12 వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలని లో గల షోలెం రాజు చర్చి, గండిమాసానిపెట్, లింగారెడ్డి పేట్ చర్చి తో పాటు మండలంలోని రుద్రారం గ్రామంలోని చర్చిల్లో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ పర్వ దినం సందర్భంగా క్రైస్తవ సోదరులు ఉదయాన్నే లేచి తలంటుకుని, చిన్న, పెద్ద అనే భేదం లేకుండా నూతన వస్త్రాలు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక సి ఎస్ ఐ చర్చిలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చి ప్రెస్బైటర్ ఇంచార్జి ఫాదర్ రెవరెండ్ ఎర్రోళ్ల ప్రభాకర్ క్రీస్తు జననం, ఆయన బోధించిన ప్రవచనాలు వినిపించారు. లోక రక్షకుడు ఐన ఏసు క్రీస్తు పాపులను రక్షించడం కోసమే ప్రపంచంలో మానవ రూపంలో అవతరించాడని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏసు చూపిన మార్గంలో నడుచుకోవాలని ఏసు చూపిన మార్గం మానవాళికి అనుసరణీయం అని సూచించారు. అనంతం వారికి క్రీస్తు దీవెనలను అందించారు. చర్చి కి వచ్చిన క్రైస్తవ సోదరులు తమకు తోచిన విధంగా కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ డయాసిస్ ప్రాపర్టీ సెక్రటరీ మంత్రి సల్మాన్ రాజు, సి ఎస్ ఐ చర్చి సెక్రటరీ జొన్న గడ్డల రాజశేఖర్, స్టువర్ట్ బ్రహ్మయ్య,  ట్రెజరర్ ప్రభు కుమార్, ప్రాపర్టీ సెక్రటరీ విజయ్, మహిళా సెక్రటరీ రేవతి ఇమానియల్ , మాజీ జడ్పీటిసి చినబాలి సామెల్, కృష్ణయ్య, జ్యోతిరాజ్, తదితరులు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్  చైర్మన్ కుడుముల సత్యనారాయణ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

*ఏదవర్షిప్ చర్చిలో*…

4 వ వార్డు శివారులోని ఏద వర్షిప్ చర్చిలో ఎద మినిస్ట్రీస్ వారి అధ్వర్యంలో  క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఏద మినిస్ట్రీస్ వారి ఎద వర్షిప్ చర్చి నిర్వాహకులు బ్రదర్ శ్రీనివాస్ చారి, సిస్టర్ హెబ్సిబా చారి లు ఏసు క్రీస్తు ప్రవచనాలను వినిపించారు. దైవ సేవకుల ద్వారా దేవుడు ఏసు క్రీస్తు పాపుల కొరకే ఈ లోకంలో వచ్చాడని, పాపములను వదిలి నీతి, నిజాయితీ గా జీవించాలని సూచించారు. ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ జడ్పీటిసి చినబాలి సామెల్, సొసైటి డైరెక్టర్ సుఖేందర్ రెడ్డి, నాయకులు సంజీవ రెడ్డి లు ఎదవర్షిప్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఏసుక్రీస్తు దీవెనలు  కలగాలని ప్రార్థించారు.

*షోలెం రాజు  చర్చిలో*…

12 వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనిలో గల షోలెం రాజు చర్చిలో పాస్టర్ భాస్కర్ క్రైస్తవ సోదరులకు లోక రక్షకుడు ఏసు క్రీస్తు ప్రవచనాలను చదివి వినిపించారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన మార్గంలో నడుచుకోవాలని, అందరికి క్రీస్తు దీవెనలు అందించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ కు ఫాస్టర్ భాస్కర్ శాలువా కప్పి సత్కరించారు. అనంతరం మాజీ చైర్మన్ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

You may also like

Leave a Comment