Home తాజా వార్తలు ఆదిత్య ,శ్లోక పాఠశాలల్లో క్రిస్మస్ సంబరాలు

ఆదిత్య ,శ్లోక పాఠశాలల్లో క్రిస్మస్ సంబరాలు

by Telangana Express


.మిర్యాలగూడ డిసెంబర్ 23 తెలంగాణ ఎక్స్ ప్రెస్: ఆదిత్య , శ్లోక పాఠశాలలలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ ఎందుకు చేస్తారో వివరిస్తూ, యేసుక్రీస్తు పుట్టుక ప్రాముఖ్యత, పుట్టిన తర్వాత జరిగిన ఘట్టాలు పిల్లలు వేషధారణలో వచ్చి వివరించారు. ఈసందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మారుతి అమరెందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని మతాలకు సంబంధించిన పండుగల గురించి అన్ని మతాల వారికి తెలియాలి అని ,పాఠశాలలో అన్ని మతాల పండుగల గురించి వివరిస్తూ పండుగలు చేస్తున్నాము అన్నారు. అన్ని మతాల దేవుళ్ళు ఒకటే చెప్తారని, దేవుడు ఒక్కడే అని,మనమంతా భారతీయులమని అన్నారు. ఈసందర్భంగా అతిథిగా వచ్చిన హౌసింగ్ బోర్డు,మిర్యాలగూడ నిత్య కృపా ప్రార్థన మందిరం పాస్టర్ ఏ. అరుణోదయ్ ప్రార్థన చేసి.క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా అన్ని కులమతాల వారు కలసిమెలసి సోదరభావముతో ఉండాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఆదిత్య పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ కట్టా అనిత , శ్లోక స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ .రాధిక ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment