Home తాజా వార్తలు బైరు చేరికపై చౌదరిగూడ కాంగ్రెస్ పార్టి నాయకుల ముసలం

బైరు చేరికపై చౌదరిగూడ కాంగ్రెస్ పార్టి నాయకుల ముసలం

by Telangana Express

బైరును పార్టీలో చేర్చుకోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రేస్ శ్రేణులు…

రౌడీ షీటర్ని కాంగ్రెస్ లోకి తీసుకోవడాన్ని కండిస్తున్నాం -కట్ట ఆంజనేయులు.

బైరు రాములు గౌడ్ ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దు…

ఘట్కేసర్ ఏప్రిల్ 08(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల చౌదరిగూడ కాంగ్రేస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఆయన నివాసములో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్, బైరు రమాదేవిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.వారి చేరికను ముక్తకంఠంతో అందరూ విమర్శించారు. చౌదరిగూడలో గత 20 సంవత్సరాలుగా వారి కుటుంబం సర్పంచి హోదాలో ఉండి ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని విమర్శించారు. రాములు గౌడ్ రౌడీషీటర్ ల్యాండ్ గ్రాపర్, భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తని మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పకుండా ఎలా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారని ప్రశ్నించారు.గతంలో రేవంత్ రెడ్డి శవయాత్ర చేసి చెప్పుతో కొట్టిన వ్యక్తిని పార్టిలోకి ఎలా తీసుకుంటారు అని అన్నారు. ఇకనైనా చేరికలకమిటీ,తోటకూర వజ్రేష్ యాదవ్ మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.స్థానిక గ్రామ శాఖ నాయకులము అయిన మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా కండిస్తున్నామని అన్నారు.ఆయనను పార్టీలోకి తీసుకుంటె తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.ఈ మేరకు విలేకరులు అడిగిన ప్రశ్నకు బైరును పార్టీలో అలాగే కొనసాగిస్తే తమ తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో చౌదరిగుడా గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు గౌడ్, భోజిరెడ్డి, బండ్లగూడ నాగేష్, నర్సింగ్ రావు, వినోద్, శ్రీనివాస్, నక్క నరసింహ, దామోదర్ రెడ్డి, ఈశ్వర్, సిద్ధ గొని నరసింహ గౌడ్, సందీప్ రెడ్డి, మంచాల ధనరాజ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు..

You may also like

Leave a Comment