జిల్లా అధ్యక్షులు మల్యాల రాజా గౌడ్..
వీణవంక, ఫిబ్రవరి 7( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కల్లుగీత వృత్తిదారుల సంఘం మండల ఉపాధ్యక్షుడిగా చింతల మహేష్ ను నియమించినట్టు జిల్లా అధ్యక్షుడు మల్యాల రాజా గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ… నా నియామకానికి సహకరించిన గౌడ కులస్తులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవించే గీత కార్మికులకు సేఫ్టీ మోక్కులు అందించి ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు.