Home తాజా వార్తలు కేస్లాపూర్ నాగోబా జాతరలో ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి పూజలు

కేస్లాపూర్ నాగోబా జాతరలో ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి పూజలు

by Telangana Express

స్వాగతం పలికిన స్థానిక ఎమ్మెల్యే వేడ్మా బోజ్జు పటేల్, అదిలాబాద్ ఇంచార్జ్ మంత్రి సీతక్క, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల, ఫిబ్రవరి 02, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): కేస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ఖానాపూర్ నియోజకవర్గం కేస్లాపూర్ నాగోబా జాతర ను సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు చేరుకున్నారు.

శుక్రవారం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ముఖ్యమంత్రి ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రకారం, గోపురాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కేస్లాపూర్ నాగోబా అభివృద్ధికి సంబంధించిన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా జాతర సూవిశాలమైన మైదానంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు పటేల్, మంత్రి సీతక్క, మంచిర్యాల ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, ఎమ్మెల్యేలు, నాయకులు, ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు స్వాగతం పలికి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి సభ ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి అని గుర్తు చేశారు. ఇంద్రవెల్లి నిర్వహించిన గిరిజన దండోరా సభ విజయవంతం అయిందని ఇందరవెల్లి గిరిజనులకు తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీని ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారం చేపట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత అధికారికంగా మొట్టమొదటి సారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి రావడం ఇదే రాష్ట్రంలోని ప్రథమ సభాని ముఖ్యమంత్రి తెలిపారు. బారాస నేతలు శాపనార్ధాలు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అని సభలో ప్రజలకు తెలియజేశారు. భారాస ప్రభుత్వం గడిచిన పాలనలో ఎడు లక్షల కోట్లు అప్పు తెచ్చిందన్నారు. ఏనాడైనా అడవిబిడ్డల కోసం అసంపూర్తి ఆలోచించారన్నారు. రాష్ట్రంలో 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాడే ప్రజా ప్రభుత్వంగా మార్చమని తెలిపారు. భారాస నేతలు శాపనార్థాలు పెడుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్‌ పదేళ్లలో ఏమీ చేయలేదు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లోనే చేయడం సాధ్యపడుతుందా అని ప్రశ్నించారు. త్వరలోనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రయాణాన్ని ఆపాలని కుట్రలు చేస్తున్నారన్నారు కుట్రలు చేసేవాళ్లు గ్రామాలలోకి వస్తే బుద్ధి చెప్పండని ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు ఆత్మగౌరవంగా బతకాలని ముఖ్యమంత్రి అన్నారు. స్వయం సహకార సంఘాలకు పూర్వ వైభవం తెస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఇచ్చి వస్త్రాలు కుట్టే అవకాశం స్వయం సహాయక సంఘాలకు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కేస్లాపూర్ నాగోబా జాతరలో మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం ముఖ్యమంత్రి నిర్వహించారు. స్వయం సహాయక మహిళ సంఘాలు మాట్లాడుతూ తమ ఆర్థిక సుపరిపాలన పొందిన విధానాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తమకు ఆర్థిక భరోసా లభిస్తుందని మహిళలు ముఖ్యమంత్రిగా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా వస్త్రాలు కొని కుట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఐదువందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో లక్ష మంది రాష్ట్ర ఆడబిడ్డల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.

అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం కేంద్రంలో పలు రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించిన అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం పరిసరాలలో స్ర్మతి వనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎంపీ సీట్లు ఎక్కువగా గెలిపించాలని బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, గిరిజన ప్రజలు, మహిళ నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment