తెలంగాణ ఎక్స్ ప్రెస్ 19/02/24
భైంసా మండలం కేంద్రం లో నీ
రాహుల్ నగర్. కాలోని లో నీ
భారత కీర్తిని ప్రపంచదేశాలకు చాటిన ధీరుడు ఛత్రపతి శివాజీ అని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భైంసా అధ్యక్షులు ప్రసంజీత్ హేమ్లే అన్నారు భైంసాలోని రాహుల్ నగర్ మైత్రేయ బుద్ధ విహార్ లో సోమవారం రోజున బిఎస్ఐ బైంసా శాఖ ఆధ్వర్యంలో మహనీయుడు ఛత్రపతి శివాజీ 394 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడు.. ధైర్యానికి, పోరాటానికి, సహసావీరులైన రాజుల్లో ప్రతిరూపంగా నిలిచారని వారు కొనియాడారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల్లో శివాజీ ఒకరని, శివాజీ యువతకు స్ఫూర్తి దాయకులని, ఆయనను ఆదర్శంగా తీసుకొని యువకులంతా దేశ రక్షణకు పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఎస్ఐ భైంసా అధ్యక్షులు ప్రసంజీత్ హేమ్లే, ఏక్ నాథ్ బిరదే, పరుశురాం వాగ్మారే, జల్బ వానేకర్, దత్తరాం షానే , గణేష్ హేమ్లె, బౌద్ధ ఉపాసిక, ఉపాసకులు మరియు మాజీ శ్రామినర్, బౌద్ధాచార్యులు, కేంద్రీయ శిక్షకులు, బౌద్ధ దమ్మ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
బిఎస్ఐ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి
80