Home తాజా వార్తలు ఆత్మాభిమానానికి పౌరుషానికి ప్రతీక చత్రపతి శివాజీ మహారాజ్

ఆత్మాభిమానానికి పౌరుషానికి ప్రతీక చత్రపతి శివాజీ మహారాజ్

by Telangana Express

ఘట్కేసర్,ఫిబ్రవరి19(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ ఎఫ్ సి నగర్ లో ఈరోజు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ముఖ్య అతిథిగా మేడ్చల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఘట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఎంపిపి మాట్లాడుతూ భారతమాత ముద్దుబిడ్డ ఆత్మాభిమానానికి పౌరుషానికి ప్రతిక మన చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ సినీ బోర్డు నెంబర్ మైపాల్ రెడ్డి నాయకులు రాజశేఖర్ రెడ్డి,నరేష్, వీరేశం, మధుసూదన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మురళీకృష్ణ, ఆర్ఎస్ఎస్ ఇంచార్జ్ నర్సింహారెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, జైపాల్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు…

You may also like

Leave a Comment