చేగుంట ఫిబ్రవరి 22 తెలంగాణ ఎక్స్ ప్రెస్
మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి సొసైటీ ఛైర్మన్, ముదిరాజ్ సంగం మండల అధ్యక్షులు మేకల పరమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వైఖరికి నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వడం లేదని, పార్టీ పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఎమ్మెల్యేపై ఆగ్రహం మండిపడ్డారు
అదేవిధంగా పార్టీలో పనిచేసే నాయకుల మధ్య సమన్వయ లోపంతో మండలంలో ఉన్న నాయకులను కొంతమంది నాయకులు మభ్యపెడుతూ కొంతమంది చలామణి అవుతున్నారని మండిపడ్డారు