*నివాళులర్పించిన సోదరుడు నాగరావు*
లోకేశ్వరం డిసెంబర్ 11
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మెన్ లక్కంపల్లి జీవన్ రావు 18వ వర్ధంతి సందర్భంగా బుధవారం వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరుడు నాగారావు, నాయకులు కార్తీక్ రావు, నర్సింగ్ రావు, సునీల్, లక్ష్మణ్ రావు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
