మిర్యాలగూడ డివిజన్ జులై 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సంఘర్షణ సైకిల్ యాత్ర మిర్యాలగూడ పట్టణంలో చేరుకోగానే ప్రజాసంఘల నాయకులు యాత్రకు సంఘీభావం తెలుపుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారి మల్లేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ* విద్య బలోపేతంకై ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న సంఘర్షణ సైకిల్ యాత్ర స్వాగతం తెలుపుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే పాఠశాలలో సంక్షేమ హాస్టల్లో గురుకులల్లో అనేక సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచకుండా అరకోరా చార్జీలు పెంచి ఆర్భాటాలకు పరిమితమైనరు తప్ప పేద విద్యార్థులకు సంపూర్ణంగా భోజనం పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు పెండింగ్ చార్జీలు విడుదల నేటికి చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు మిర్యాలగూడ ప్రాంతంలో అనేకసార్లు అధికారులకు మహిళా జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విన్నవించుకున్న ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ మహిళ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నియోజకవర్గం లో అనేక ప్రభుత్వ విద్యాసంస్థలను సంవత్సరాల తరబడి పూర్తిస్థాయిలో నిర్మించలేకపోవడం విద్యార్థుల శాపమా.. కాంట్రాక్టు నిర్లక్ష్యమా.. అధికారుల కమిషన్ల కోసమా.. ఏ రీతిలో అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు తక్షణమే ప్రభుత్వం పెండింగ్ భవనాల బిల్లును విడుదల చేసి పూర్తి చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్, ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి కుర్ర సైదానాయక్, సిఐటియు నాయకులు గౌతమ్ రెడ్డి, మంగారెడ్డి, పాండు, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శీను, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు లక్ష్మణ్, రమేష్, జగన్, వీరన్న, నుమన, తరుణ్ తదితరులు పాల్గొన్నారు
Latest
బిసి గురుకులాని అల్లాదుర్గంలోని నే ఏర్పాటు చేయాలి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేస్తున్న జేఏసీ నాయకులు.
జోగిపేట్ జులై 26:-(తెలంగాణ ఎక్స్ప్రెస్) ఆందోల్ నియోజకవర్గం లో అల్లాదుర్గం మండల కేంద్రానికి మంజూరైన బిసి గురుకుల పాఠశాలను తిరిగి అల్లాదుర్గంలోనే ఏర్పాటు చేయాలని కలెక్టర్కు రాజర్ష ను కలసి జేఏసీ నాయకులు కంచరి బ్రహ్మం. కాల రాములు వినతి పత్రాన్ని అందజేశారు. చిల్వర గ్రామంలో కలెక్టర్ ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లాదుర్గం మండల కేంద్రానికి మంజూరైన గురుకుల పాఠశాలను సంగారెడ్డి జిల్లా, పటాన్చెరువు మండలం పెద్ద కంజర్ల లో ఏర్పాటు చేశామన్నారు దీంతో ఈ ప్రాంతానికి విద్యార్థులకు దూర భారం కావడంతో ఈ గురుకులాని తిరిగి సంగారెడ్డి జిల్లా. వట్పల్లిలో ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అల్లాదుర్గం కు మంజూరైన పాఠశాలను ఇక్కడే ఏర్పాటు చేయాలని కలెక్టర్కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయంపై ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు
సీఎం,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల జీతాలు పెంచిన కెసిఆర్, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు ఎందుకు పెంచవు…? బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహాల్లద్ రావుకుల్కచర్ల, జూలై 26, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బిజెపి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో గల స్థానిక ఎంపీడీవో ఆఫీస్ దగ్గర నిరసన దీక్ష నిర్వహించారు. గత 22 రోజుల నుంచి గ్రామపంచాయతీ కార్మికులు తమ హక్కుల సాధన కోసం సమ్మె చేస్తున్నారని,బుధవారం బిజెపి ఆధ్వర్యంలో కులకచర్ల లో నిరసన దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహాల్లద్ రావు, మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ ముదిరాజ్, ఓ బి సి జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర లింగం మాట్లాడారు, తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి గ్రామపంచాయతీ కార్మికుల పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా చెస్తుందని అన్నారు. దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు పెంచినప్పుడు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచడంలో ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటి అని వారు ప్రశ్నించారు, ఈ దేశంలోనే అత్యధికంగా వేతనాలు తీసుకునే కెసిఆర్ ,మంత్రులు, ప్రజాప్రతితులు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు, కరోనా సమయంలో గ్రామపంచాయతీ కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రెడ్ జొన్ లోకి వెళ్లి ప్రజల ప్రాణాలు కాపాడడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని వారు అన్నారు. కరోనా సమయంలో గ్రామపంచాయతీ కార్మికులను దేవుళ్లతో సమానంగా పోల్చిన కేసీఆర్ ఓడ్డు ఎక్కిన తర్వాత గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కరోనా సమయంలో వివిధ రకాల కార్మికులు ప్రాణాలు సైతం కోల్పోయారని వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రోడ్డు మీద పడ్డాయని వారి కుటుంబాలను గుర్తించి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గ్రామపంచాయతీ కార్మికులు అగ్రభాగాన ఉన్నారని స్వరాష్ట్రంలో పంచాయతీ కార్మికులను పట్టించుకునే నాధుడే లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పిఆర్సి ప్రకారం కనీస వేతనం 19వేల రూపాయలు చెల్లించాలని కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై వేధింపులు, అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తావని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలకృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్ హనుమంతు, బిజెపి ఓబీసీ మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్, మండల ట్రెజరర్ కొండ అంజి, గండి గోపాల్, చాపల మల్లయ్య పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు పి యాదయ్య, పాటు తదితర నాయకులు.కార్యదర్శి రాములు, గౌరవ అధ్యక్షులు హనుమంతు, ఉపాధ్యక్షులు దండు వెంకటయ్య, కార్వబర్స్ , జి వెంకటేష్, శ్రీనివాస్, రమేష్, నరేష్, శేఖర్, పంచాయతీ కార్మికులు కొడుదుటి బాలమ్మ, గుంటి నర్సింలు, యాదయ్య,వెంకటమ్మ,షకీల్,కార్మికులు పాల్గొన్నారు.
కుబీర్ జులై26 🙁 తెలంగాణ ఎక్స్ ప్రెస్) లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణకి నువ్వు చేసింది ఏంది కెసిఆర్ ఐదేండ్లలలో తెలంగాణ అప్పులు డబుల్ : మోహన్ రావు పాటిల్ పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు మోహన్ రావు కుబీర్ మండలంలోని మాలెగాం, కుప్టి, వర్ని గ్రామాలలో పర్యటించి, బిజెపి జెండాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంములో మోహన్ రావు మాట్లాడుతూగ్రామాలలో డబుల్ బేడ్ రూమ్ ఇల్లు రావాలి అంటే స్థానిక నాయకులకు ముడుపులు అందక తప్పదు… తెలంగాణ ప్రజల బ్రతుకులను తాకట్టు పెట్టి నువ్వు నీ కుటుంబం కమిషన్ కోసం అప్పులు చేసి యావత్ తెలంగాణని అప్పుల ఊబిలోకి నెట్టేస్తివి. అప్పుడే పుట్టిన శిశువు నెత్తిన కూడా 2 లక్షల అప్పు భారం మోపిన వైనం మన కల్వకుంట్ల కుటుంబానికే దక్కింది అని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నాయకులు, మండల నాయకులు , గ్రామ అధ్యక్షులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….
పెద్ద శంకరంపేట:- జూలై 25(తెలంగాణ ఎక్స్ ప్రెస్)పెద్ద శంకరంపేట తాసిల్దార్ గా నూతన పదవి బాధ్యతలు చేపట్టిన గ్రేసి బాయ్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన విగ్రాంగౌర గౌడ్ కుమారుడు బిఆర్ఎస్ నాయకుడు విగ్రాం రాజన్ గౌడ్,నర్సాపూర్ నుండి బదిలీపై పెద్ద శంకరంపేటకు వచ్చిన గ్రేసీ బాయ్ ని తహసిల్దార్ ఆఫీస్ లో శాలువాతో సన్మానించి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజల మన్ననను పొందాలని ఆయన కోరారు
మక్తల్ ముదిరాజ్ జర్నలిస్ట్ ల సంఘం ఆధ్వర్యంలోమక్తల్. జులై. 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్): మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చందపూర్ గ్రామం వాసి రాజుకు మక్తల్ ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం తరపున ఆర్థిక సహాయం అందించారు. గత కొన్ని రోజుల ముందు మక్తల్ నల్లజానమ్మ టెంపుల్ దగ్గర విధులకోసం రోజువారి కూలీగా వెళుతున్న సమయంలో రోడ్డుపక్కన వెళ్తున్న రాజుకు అటునుంచి వస్తున్న లారీ రాజును ఢీకొనడంతో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అసలే కటిక పేదరికం రోజు కూలికి వెళ్తే గాని నడవని ఇల్లు, ఆదుకొనే నాధుడే లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ముదిరాజ్ జర్నలిస్టు సంఘం దృష్టికి రావడంతో ఇట్టి విషయానికి చెలించి మక్తల్ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు వల్లంపల్లి శివశంకర్ ఆధ్వర్యంలో రాజు కుటుంబానికి రెండు నెలలకు సరిపడు నిత్యావసర సరుకులు 10000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. బాధితుడు రాజు మాట్లాడుతూ నేటి సమాజంలో ఎవరికి ఏమైతేనేమిటి మేము సేఫ్ గా ఉన్నామా లేదా అని ఆలోచించే రోజుల్లో కూడా మాపై దయ తలచి ఆర్థిక సహాయం చేసిన బీసీ జర్నలిస్టులందరికీ కూడా నేను నా కుటుంబం ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అంజన్ ప్రసాద్, సలహాదారులు వాకిటి అంజయ్య ఆచారి, డి.సురేందర్, ప్రధాన కార్యదర్శి వర్కుర్ రాజు, ఉపాధ్యక్షులు తిరుపతి ఆంజనేయులు, కోశాధికారి తిరుపతి వెంకటేష్,కార్యదర్శులు క్షీరానంద్,గాసం నరసింహ, ముదిరాజ్ జర్నలిస్టులు వెంకట్రాములు, అమ్మపల్లి కృష్ణ. డి.రాము, ప్రదీప్, శంకర్, శివ, మక్తల్ సందీప్,మక్తల్ వాకిటి రాజు, మక్తల్ రాంకోటి, మక్తల్ నరేష్, కార్తీక్, తదితర ముదిరాజ్ జర్నలిస్టులు పాల్గొన్నారు
జుక్కల్ జులై 26:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో హంగర్గా గ్రామంలో బుధవారం గొర్రెలు,మేకల పెంపకందారులకు సబ్సిడీ గొర్రెలు, మేకలను పంపిణీ చేశారు. మద్నుర్ ఏడీ వెంకటేష్ చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈ మాట్లాడుతూ కుర్మయాదవులు ఆర్థికంగా ఎదగడానికి కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు, మేకలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. హంగర్గా గ్రామంలో ఆరు యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలమణి హనుమంత్, పశువైద్యాధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు
వాహనాలు తనిఖీలు చేసిన పోలీసులు
బిచ్కుంద జూలై 26:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్) కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో హెడ్ కానిస్టేబుల్ బాబు ఆధ్వర్యంలో పోలీసు వాహనాలు తనిఖీలు వహించారు ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ బాబు మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీల నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బాబు కానిస్టేబుల్ వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు
బోధన్ రూరల్,జులై26:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ రూరల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన నాగ్ నాథ్ ను బుధవారం తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ కన్వీనర్ మీసాలె నాగేష్, సభ్యులు శశిధర్,నిఖిల్,ఈశ్వర్,తది తరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట , జూలై 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని బుధవారం స్థానిక ఎంపీఓ శ్రీనివాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిర్మాణ పనులను సక్రమంగా క్యూరింగ్ చేసి నాణ్యతతో చేపట్టాలని ఆయన కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వంజరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు